నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి.
ఖమ్మంలోని శాంతి హోటల్ కాన్ఫరెన్స్ హాల్ నందు శనివారం తెలంగాణ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖమ్మం జిల్లా బీసీ సదస్సు విజయవంతమైంది . ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాతా సావిత్రి భాయి ఫూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది . చైర్మన్ పెరుగు వెంకటరమణ యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధంగా క్యాబినెట్ ఆమోదం తెలపడంశుభ సూచకం.ఇక బీసీ ఉద్యమానికి వజ్రాయుధం దొరికినట్లేనని దీనితో మన పోరాటాన్ని ఉదృతం చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో చేకూరి చైతన్య , జి నరేందర్ , పాల్వంచ రామారావు , కత్తి నెహ్రూ గౌడ్ , స్వర్ణ కుమార్ , గరిడేపల్లి సత్యనారాయణ , చల్ల హనుమంతు , వల్లెపు సోమరాజు , ప్రొఫెసర్ చేకూరి రమేష్, రిటైర్డ్ ఎంపీడీవో కొండ పద్మ , మేకల సుగుణ రావు , కోటేష్ యాదవ్ , పద్మాచారి ముర్రిమేకల అమరయ్య , ఏడుకొండలు , బత్తుల గోపాల్ రావు , వై నాగేశ్వరరావు కందిమల్ల చంద్రశేఖర్ బాజీని తిరుపతిరావు , పెళ్లూరి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .
