నేటి గదర్ న్యూస్:
రాయల సుభాష్ చంద్రబోస్ అనుసరించిన విప్లవ స్ఫూర్తిని నేటి తరం విప్లవకారులు అనుసరించినప్పుడే భారత నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా విప్లవాన్ని ముందుకు తీసుకుపోవచ్చు అని సిపిఐ ఎం ఎల్ ప్రజాపంథా నేతలు బుర్ర వెంకన్న, అజ్మీర బిచ్చ అన్నారు. ఈరోజు కామ్రేడ్ రవన్న 9వ వర్ధంతి సందర్భంగా చండ్ర కృష్ణమూర్తి ఫస్ట్ భవన్ లోఆదివారం రవన్న చిత్రపటానికి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ అరుదైన ఆదర్శ కమ్యూనిస్టు, విప్లవ ఆచరనే గీటురాయిగా విప్లవోద్యమాన్ని నడిపి అడవికి,మైదానానికి సుదీర్ఘ విప్లవ బాటసారిగా నిలిచిన కామ్రేడ్ రాయల సుభాష్ చంద్రబోస్ (రవన్న) చివరి శ్వాస వరకు విప్లవాన్ని ఆకాంక్షించి అమరత్వం పొందాడని వారు అన్నారు.మితవాదం,అతివాదానికి వ్యతిరేకంగా పోరాడి నిజమైన విప్లవ సూత్రాలను కార్యకర్తలకు బోధించి విప్లవ మాస్టారుగా విప్లవద్యమంలో ప్రయాణించాడని ఈ క్రమంలో ఎన్ని నిర్భందాలు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిబ్బరంగా నిలబడ్డాడని వారు అన్నారు. వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ఆశించి ప్రజా ఉద్యమాలను బలంగా నిర్వహించడమే రవన్నకు నిజమైన నివాళులు అర్పించడం అవుతుందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ,జర్పుల సుందర్, సావిత్రి,ఇల్లందు మండల నాయకులు శ్రీరాం కోటయ్య,గాంధీ, బుర్ర రాఘవులు,PYL నాయకులు దేవా, లక్ష్మయ్య, వాంకుడోత్ శంకర్,శాంతారావు, బాలు,ముత్తక్క తదితరులు పాల్గొన్నారు.