ఎన్నాళ్లయింది భారత క్రికెటర్లలో ఈ ఆనందాన్ని చూసి… ఎన్నేళ్లయింది భారత క్రికెట్ అభిమానులు ఇలాంటి గెలుపు సంబరాలు చేసుకొని… అందినట్లే అంది చేజారిపోతున్న ఐసీసీ ట్రోఫీ విజయాలు… ఆఖరి మెట్టుపై తడబడిన ప్రపంచ కప్ సమరాలు… అన్నీ దాటి ఇప్పుడు ఆహా అనిపించే ప్రదర్శనతో భారత జట్టు సగర్వంగా నిలిచింది.అప్పుడెప్పుడో కపిల్ వన్డే కప్ (1983) తెచ్చినపుడు మనలో చాలామందికి తెలీదు. అదొక వార్తగానే తెలుసుకున్నాం. కానీ ధోని తొలి టి20 ప్రపంచకపన్ను టీవీల్లో చూశాం. తెగ సంబరపడ్డాం. సొంతగడ్డపై మళ్లీ అదే అదే ధోని (2011) వన్డే విశ్వవిజేతను చేస్తే పెద్ద పండగ చేసుకున్నాం. మళ్లీ… మళ్లీ మళ్లీ ఎంత ప్రయత్నించినాకానీ ఇప్పుడు ఏళ్ల నిరీక్షణ తర్వాత ధోని బృందం సాధించిన తొలి టి20 ప్రపంచకప్ జట్టులోని సభ్యుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా కరీబియన్ గడ్డపై సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. రెండోసారి టి20 ప్రపంచకప్ను అందుకుంది. రోహిత్ బృందం జగజ్జేతగా అవతరించడంతో యావత్ భారతం సంబరాల్లో మునిగిపోయింది.మళ్లీ అదే సంబురాలలో యావత్తు భారత క్రికెట్ అభిమానులు,భారత దేశం ఆదివారం మునిగిపోయారు. ఇందుకు కారణం భారత్ ముచ్చటగా మూడోసారి ప్రపంచ కప్పును ముద్దాడడమే. స్పిన్నర్స్ పొదుపైన బౌలింగ్… భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ తో వీరవిహారం… వెరసి 130 కోట్ల భారతీయుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.
నేటి గదర్ న్యూస్ వెబ్ డెస్క్ :
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్కు తెరలేచింది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగుతున్న ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్కు కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ దూరమయ్యాడు. అతడి స్థానంలో నాథన్ స్మిత్ తుది జట్టులోకి వచ్చాడు. భారత్ మాత్రం ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగింది.
★భారత్తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది. కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది.
చివర్లో మైకేల్ బ్రాస్వెల్ (53*: 40 బంతుల్లో) మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ పోరాడే స్కోరు సాధించింది.
భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2, కుర్దీప్ యాదవ్ 2, షమి, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
★బ్యాడ్ లక్ రన్ మిషన్ కోహ్లి
అతి ముఖ్యమైన సమయంలో ప్రతాపం చూపెట్టాల్సిన రన్ మిషన్ కోహ్లీ 1(2) ని మైకేల్ బ్రెస్ వెల్ LBW గా అవుట్ చేశాడు. త్వరగానే మ్యాచ్ పూర్తవుతుందనుకున్న తరుణంలో రన్ మిషన్ కోహ్లీ అవుట్ భారత క్రికెట్ ప్రేమికులను నిరుత్సాహానికి గురిచేసింది.రోహిత్….శ్రేయస్ ఫటా ఫట్..
భారత ఇన్నింగ్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఇద్దరు ధాటిగా ప్రారంభించారు. ఈ క్రమంలో గిల్ 31 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అనంతరం రన్ మిషన్ కోహ్లీ 1 పరుగు కు అవుటయ్యాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ తో జత కలిపిన హిట్ మాన్ రోహిత్ స్కోర్ బోర్డు ని పరిగెత్తించాడు. రోహిత్ శర్మ76 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు.
శ్రేయస్ అయ్యర్ కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుని 48 పరుగు ల వద్ద అవుట్ అయ్యాడు. అతనికి అక్షర్ పటేల్ మంచి సహకారం అందించాడు.
చివర్లో కాస్త టెన్షన్ పడిన వికెట్ కీపర్ ,మిస్టర్ కూల్ కే ఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు భారత్ ను విజయతీరాలకు చేర్చారు. దుబాయిలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. జయహో భారత్.