*శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు మెగా సర్వీస్ క్యాంప్ తో పాటు భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ వారితో రక్త దాన శిబిరం విజయవంతం*
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామ సమీపంలో చిలకల గండి ముత్యాలమ్మ తల్లి గుడి వద్ద శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారి ఆధ్వర్యంలో మెగా సర్వీస్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్యాంపు తో పాటు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తధన శిబిరంలో శ్రీరామ ఆగ్రో సర్వీసెస్ వారు ఎండి జీ రమేష్, జి ఎం బి కృష్ణ, ఎఫ్ జి శ్రీకాంత్, విశాల్ కస్టమర్ కేర్ మేనేజర్ స్టాప్, బి రాజు కెనరా బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు,మరియు సంకల్ప వాలంటరీ ఆర్గనైజేషన్ ఖమ్మం, వారు రవిచంద్ర, తిరుపతిరావు, సింధు, కిషోర్, సన్నీ, లోకేష్ పాల్గొన్నారు, ఈ రక్తాన్ని వందలాదిమంది సికిల్ సెల్ అనేమియా, తలాసేమియా తో బాధపడుతున్న పిల్లలు, కొరకు రక్తదానం శిబిరంనీ భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి, గుగులోతు బాబు, పొదుటూరి ప్రేమ్ సాయి, ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో చాలామంది రైతు మిత్రులు మరియు ఇతర ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టాలి అని, ఆదివాసీ గిరిజన ప్రాంతం ఆయన అశ్వారావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని కొనియాడారు, వేసవి కాలంలో లో రక్తం కొరత ఎక్కువగా ఉండటం వల్ల రక్త నిలువలు తగ్గుతున్నాయి , కావున మీ ప్రాంతాలలో 10-30 మంది వరకు ఒక్కటై రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలి అని భద్రాద్రి బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఫౌండర్ గుజ్జులా వేణు గోపాల్ రెడ్డి కోరారు అలాగే ఈ క్యాంప్ కార్యాలయంలో పాల్గొని విజయవంతం చేసిన వారి అందరికీ పేరు పేరు న ధన్యవాదాలు తెలిపారు.
*అమ్మ జన్మనిస్తుంది, రక్త దత్త పునర్జన్మనిస్తాడు* అందరూ రక్త దానం చేసి రోగుల ప్రాణాలను కాపాడాలని కోరారు.
