★రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి పిలుపు
★భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు
నేటి గదర్ న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం :
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ని అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం దుర్మార్గమైనటువంటి చర్య అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మండి పడ్డారు. ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఏదైనా తప్పు చేసి ఉంటే రికార్డులు చూపించాలని కోరినా కానీ.. కక్షపూరితంగా వ్యవహరించి ఆయనను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయడం ప్రజా గొంతుకను నొక్కే ప్రయత్నం అన్నారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమానికి BRS కేంద్ర నాయకత్వం పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని ప్రభుత్వానికి ఒక కనువిప్పును కలిగించేలా చేయాలని కోరుతున్నాను.