నేటి గదర్ న్యూస్, పినపాక :
పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు వేసుకుంటూ హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు మోదుగ పువ్వు తో తయారుచేసిన రంగులను ఒకరికి ఒకరు చల్లుకుంటూ ఆనందంగా హోలీ జరుపుకున్నారు. ఈ బయ్యారం గ్రామంలో సహజ రంగులతో నృత్యాలు చేసుకుంటూ హోలీ పండుగను అందరూ ఆనందంగా సరదాగా గడిపారు. ఈ బయ్యారం గ్రామంలో గల శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ కళ్యాణ నిర్వహించారు. సాయంత్రం వేళలో స్వామి వారు ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తజనం అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 19