+91 95819 05907

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని తేల్చేసింది.* ఈ మేరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేశారు. దీంతో ఇప్పటివరకూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారితో పాటు ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగిన వారి గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన వలసదారులకు అమెరికాలో శాశ్వతంగా ఉండే హక్కు లభిస్తుందన్న గ్యారంటీ లేదని* ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా తేల్చిచెప్పేశారు. దీంతో ఈ కార్డుల చెల్లుబాటుపై కొత్త అనుమానాలు మొదలయ్యాయి. అమెరికాలో ప్రస్తుతం గ్రీన్ కార్డులు శాశ్వత నివాస గుర్తింపుకు చిహ్నంగా ఉన్నాయి. విదేశీయులకు అమెరికాలో నివసించేందుకు, పని చేసుకునేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు జేడీ వాన్స్ ప్రకటనతో ఇకపై అలాంటి గ్యారంటీ ఏమీ లేదని తేలిపోయింది. *గ్రీన్ కార్డులపై శాశ్వత నివాసం అని ఉన్నంత మాత్రాన వారు శాశ్వతంగా ఇక్కడే ఉండేందుకు గ్యారంటీ లేదని* జేడీ వాన్స్ తన ప్రకటనలో తెలిపారు. ఇది ప్రాథమికంగా వాక్ స్వాతంత్య్రానికి సంబంధించినది కాదని, ఇది జాతీయ భద్రత గురించి అని వ్యాఖ్యానించారు. కానీ అమెరికన్ ప్రజలుగా మన జాతీయ సమాజంలో ఎవరిని చేరాలని నిర్ణయించుకుంటామనే దాని గురించి కూడా ఇది చాలా ముఖ్యమైనది అని ఫాక్స్ న్యూస్‌లో “ది ఇంగ్రాహం యాంగిల్” హోస్ట్ లారా ఇంగ్రాహంకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. *విదేశాంగ కార్యదర్శి, అధ్యక్షుడు ఈ వ్యక్తి అమెరికాలో ఉండకూడదని నిర్ణయించుకుంటే, వారికి ఇక్కడ ఉండటానికి చట్టపరమైన హక్కు ఉండదని* జేడీ వాన్స్ తేల్చిచెప్పేశారు. కొలంబియా విశ్వవిద్యాలయంలో గత వసంతకాలంలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలలో పాల్గొన్నందుకు అరెస్టు చేసిన కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమూద్ ఖలీల్ అరెస్టుపై స్పందిస్తూ వాన్స్ ఈ వ్యాఖ్యలు చేశారు. *ఖలీల్ గ్రీన్ కార్డ్‌ను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసిందని అతని న్యాయవాది చెప్పారు,* కానీ విచారణ జరిగే వరకు అతన్ని బహిష్కరించే తక్షణ ప్రయత్నాన్ని న్యూయార్క్ ఫెడరల్ జడ్జి జెస్సీ ఫర్మాన్ అడ్డుకున్నారు. వాస్తవానికి నేరపూరిత కార్యకలాపాలు, దేశం నుండి ఎక్కువ కాలం గైర్హాజరు కావడం లేదా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను పాటించడంలో వైఫల్యం వంటి *కొన్ని పరిస్థితులలో గ్రీన్ కార్డ్‌ను రద్దు చేయడానికి అమెరికా చట్టాలు అనుమతిస్తున్నాయి.*

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !