ఖమ్మం మార్చి 16 : ముస్లిం మైనార్టీల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తానని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత జోలి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. శనివారం సాయంత్రం మదర్సే ఇస్లామియా దారుల్ ఊలుమ్ లో జమీయత్ ఉలేమా ఏ హింద్ జిల్లా అధ్యక్షులు , మదర్సా కరస్పాండెంట్ మౌలానా మహమ్మద్ సయీద్ అహ్మద్ ఖా ష్మీ అధ్యక్షతన జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రోజు రోజుకు ఖమ్మం నగరం వేగంగా అభివృద్ధి చెందుతోంది , ఫలితంగా అవసరాలు పెరుగుతున్నాయి . ఈ క్రమంలోనే ముస్లిం మైనార్టీలు అత్యధిక మంది కొత్త షాదీ ఖానాలు, కొత్తగా ఖబర్ స్తాన్లా ఏర్పాటుకు తన దగ్గర ప్రస్తావిస్తున్నారని , వీటి గురించి జిల్లా కలెక్టర్ దృష్టికి తాను ఈ సమస్యలను తీసుకుని వెళ్లానని పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో రెండు షాదీఖానాల నిర్మాణానికి మీరు ఎక్కడ కోరిక అక్కడ నిర్మించడానికి సిద్ధమన్నారు. నేనెవరో తెలియని దశలో నన్ను మీరంతా మద్దతు పలికి , గెలిపించారని , ఈ రుణం తీర్చుకోలేని దని అన్నారు. తన విజయంలో ముస్లింల పాత్ర ఎంతో ఉందని తెలిపారు.కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ దేశంలోనే ఆదర్శ పూరిత వాతావరణంతో ఖమ్మం జిల్లా ఉందని , ఇది ఇలాగే ఇతర జిల్లాలకు ఆదర్శంగా ఉండాలని ఆకాంక్ష అంటూ ముస్లిం పెద్దలు మంత్రి ద్వారా చెప్పిన సమస్యల పై ఈ రంజాన్ మాసంలోనే మరో రెండు వారాలలో కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ ఎలాంటి కలహాలు లేకుండా శాంతియూత వాతావరణంలో ఖమ్మం జిల్లా ప్రజానీకం జీవిస్తున్నారని , ఇది మంచి సాంప్రదాయం అంటూ కితాబు ఇచ్చారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.









