+91 95819 05907

ఖమ్మం జిల్లా మార్కెట్ అధికారి DMO ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలి:

★ఈ నెల 28న మహా ధర్నా
★ రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి
★లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షులు మరియు ST సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కొ ఆర్డినేటర్ రాజేష్ నాయక్ పిలుపునిచ్చారు.

ఖమ్మం జిల్లా మార్కెట్ అధికారి DMO ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమంలో రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రైతులు పాల్గొని జయప్రదం చేయగలరని మనవి. లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) రాష్ట్ర అధ్యక్షులు మరియు ST సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర కొ ఆర్డినేటర్ రాజేష్ నాయక్ పిలుపునిచ్చారు.

ధర్మసోత్ దశరధ్ నాయక్. ఎల్ హెచ్ పి ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. రాష్ట్ర ఉపాధ్యాక్షుడు. భూక్య. పంతులు నాయక్. కార్యదర్శి గూగులోతు కృష్ణ నాయక్. వైరా నియోజకవర్గ ఇన్చార్జి. లకావత్ నాగేశ్వర నాయక్. జిల్లా నాయకులు. బానోతు నందు నాయక్. సాయి నాయక్. శ్రీనివాస్ నాయక్.
 ఖమ్మం ఉమ్మడి జిల్లాలో రైతులు పండించుకున్న పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని గౌరవ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి తెలియ పరిచినప్పటికీ, ట్రేడర్స్, దళారులు సిండికేట్ అయి, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిలు దళారులు ఇచ్చే కాసులకు ఆశపడి రైతులు తెచ్చిన నాణ్యత గల పంటను నాణ్యత లేదని సాకులు చెపుతూ రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నందున రైతులకు అన్యాయం జరుగుతుందని తెలియపరిచినా వారిపై శాఖాపరమైన ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆంతర్యం ఏమిటో గౌరవ మంత్రివర్యులె చెప్పాలి.
 ఖమ్మం జిల్లా, మార్కెట్ అధికారి DMO గారు మరియు ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి MA అలీం గారు ఇంచార్జిగా వారి పర్యవేక్షణలో, ఏన్కూర్ మార్కెట్ కార్యదర్శి భూక్యా బజారు గారు సబ్ యార్డ్ జూలూరుపాడు ప్రత్తి మార్కెట్ కోసం వ్యవసాయ భూమి సర్వే నెంబర్ 198/199 లో ఎకరములు 3.20 గుంటలు భూమికి చేసుకున్న కౌలు ఒప్పందానికి గాను శ్రీ తాళ్ళూరి నవీన్ గారికి చెల్లించిన కౌలు అమౌంట్ రూ.1,30,000/- (అక్షరాల ఒక లక్ష ముప్పై వేల రూపాయలు) చెల్లించారని చెపుతున్నారు. జిల్లా మార్కెట్ కార్యాలయం నుండి ఎటువంటి అనుమతి ఇవ్వలేదని సమాచారం హక్కు చట్టం-2005 ద్వారా తెలియపరిచినారు. ఈ యొక్క అనుమతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి.
తెలంగాణ వ్యవసాయ మార్కెట్ జారీ చేసిన G.O.58 ప్రకారం ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఏన్కూర్, జూలూరుపాడు మండలాలలో గిరిజనేతరులకు లైసెన్స్ పొంది ఉంటె ఏజెన్సీ ప్రాంతంలో వర్తించదు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకు వ్యాపారం చేసే హక్కు లేదని చట్టం చెప్తున్నది.
 ఏజెన్సీ చట్టాలు 1/59, r/w, 1/70 చట్టం, 1996 పీసా చట్టం ప్రకారం కొనుగోలు అమ్మకాలు, వ్యాపారం గిరిజనులకు మాత్రమె చేయాలని చట్టం చెపుతుంది.
 గిరిజనేతరులలో లైసెన్స్ పొందిన వారు, 20 మంది O.C. కులానికి చెందిన వారు, 7 గురు B.C. కులానికి చెందిన వారు, మొత్తం 27 మంది సభ్యుల లైసెన్స్ ను రద్దు చేయాలి.
 ఖమ్మం జిల్లా DMO గారి అండతో, మిర్చి ట్రేడర్స్ నాణ్యత లేదని సాకులు చెపుతో కొనుగోలులో జాప్యం చేయడం వలన యార్డులో మించి నిల్వలు పెరిగిపోయి రైత్యులకు నిరాశ కలిగించి, రోజులు గడిచిన తర్వాత రైతులు చేసేది ఏమీ లేకపోవడంతో దళారులకు తక్కువ ధలకు మిర్చి విక్రయించడమ వలన రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఇది వాస్తవం కాదా.
 ఖమ్మం జిల్లా DMO గారి అండతో పత్తి కొనుగోలు దళారీలతో చేతులు కలిపి పాటి చేతికి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన అంశం – పత్తి లారీ లోడ్ మార్కెట్ చెస్ కట్టించుకోకుండా రైతు నుండి డీలర్లు పత్తి కొనుగోలు చేసినట్టు చూపిస్తూ వేరే రాష్ట్రాలకు తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇది వాస్తవం కాదా !
 ఖమ్మం జిల్లా DMO గారి అండతో – ఖమ్మం, మధిర, మద్దుల్లపల్లి, నేలకొండపల్లి, వైరా వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని CCI సెంటర్లలో రైతుల పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు చూపుతూ, పత్తి కొనుగోలు దారులు మరియు మిల్లర్లు, దళారులు వేరే అకౌంటులో పేమెంట్ చేసుకుని రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. రైతులు CCI సెంటర్ ల దగ్గర పత్తి అమ్మడానికి వెళితే, తేమ శాతం ఉందని కొనుగోలు చేయకుండా, రైతులు వాహనాల మీద తీసుకొని వచ్చిన పత్తిని ఏమి చేయాలో దిక్కు తోచక మిల్లు యజమానులకు రూ.5,500/- ల నుండి రూ.6,000/-ల వరకు తక్కువ ధరకు అమ్ముతున్నారు. అదే పత్తిని CCI సెంటర్ లో మిల్లు యజమానులు, దళారులు రూ.7,521/- లకు విక్రయిస్తూ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నారు. ఈ విషయమై రైతులు DMO గారికి మరియు మార్కెట్ కమిటీ కార్యదర్శికి ఫిర్యాదు చేసినప్పటికీ, సదరు మిల్లర్ల వద్ద, దళారుల వద్ద ముడుపులు తీసుకుని అధికారులు మిల్లర్లపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు.
 ఖమ్మం జిల్లా, జిల్లా ఇంచార్జ్ మార్కెట్ అధికారి (I/C DMO) బాధ్యతలు స్వీకరించి, అనంతరం జిల్లా మార్కెట్ అధికారి (DMO) గా పూర్తి బాధ్యతలు స్వీకరించిన MA.అలీం గారు ఖమ్మం జిల్లాలో విధులు కొనసాగించిన కాలంలో, మద్దుల్లపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కాంట్రాక్టర్ ఇచ్చిన కాసులకు ఆశపడి, నూతన మార్కెట్ ను నాణ్యత లేని గోడౌన్ నిర్మాణం చేసినారు. ఇట్టి నిర్మాణంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు తెలియవచ్చింది. సమగ్ర విచారణ జరిపించాలి.
మరియు ఖమ్మం జిల్లా లో వివిధ ఉత్సవాల కోసం మరియు మీటింగ్ ల కోసం మరియు వివిధ అధికారుల పర్యటనల సందర్భంగా జరిగే వివిధ నిధుల వినియోగంలో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించగలరు.

 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో DMO గా MA అలీం గారు పనిచేసిన కాలంలో (తేది: జూన్-2021 నుండి 05-09-2024 వరకు), వివిధ ఉత్సవాల కోసం మరియు మీటింగ్ ల కోసం మరియు వివిధ అధికారుల పర్యటనల సందర్భంగా జరిగే వివిధ నిధుల వినియోగంలో ఆయన అనేక అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. ఈ విషయమై సమగ్ర విచారణ జరిపించగలరు.
 భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో DMO గా MA అలీం గారు పనిచేసిన కాలంలో (తేది: జూన్-2021 నుండి 05-09-2024 వరకు), గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కోసం స్కీములో గొర్రెలు కొనుగోలు చేసినట్లు చూపుతూ, మంజూరు అయిన నిధులను దుర్వినియోగం చేసి అవినీతి అక్రమాలకు పాల్పడినారు, ఇది వాస్తవం కాదా. విచారణ జరుపగలరు.
 పై అంశాలను పరిశీలించి, ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించి, వ్యవసాయ అధికారుల అవితీని అక్రమాలపై మరియు డీలర్లు, ట్రేడర్లు, దళారులపై సమగ్ర విచారణ జరిపించి రైతులను ఆదుకొని తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !