●సంవత్సరాలు గడుస్తున్నా బాధితులకు అందనినష్టపరిహారం
●రాజమల్ల సుకుమార్ తెలంగాణ మాల మహానాడు ములుగు జిల్లా అధ్యక్షులు జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు
నేటి గదర్ న్యూస్ ప్రతినిథి మంగపేట.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారనీ. వివిధ కేసులకు సంబంధించి ఫిర్యాదు దారులు కోర్టులకు హాజరయ్యేందుకు, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వపరంగా పరిహారం అందజేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం 1989కు కేంద్ర ప్రభుత్వం 2016లో మరింత బలోపేతం చేసింది. ఈ చట్టం ప్రకారం బాధితులకు ప్రభుత్వపరంగా మూడు విడుతల్లో పరిహారం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ సొమ్మును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా కింద బాధితునికి అందజేయాలి. అట్రాసిటీ కేసుల్లో ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదైన వెంటనే రూ.25 శాతం, పోలీసులు కోర్టుల్లో చార్జ్‌షీట్ వేయగానే 50 శాతం, శిక్ష ఖరారైన తరువాత మరో 25 శాతం పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలా కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైన తరువాత 25 శాతం పరిహారం అందుతున్నప్పటికీ ఆ తరువాత చెల్లించాల్సిన వాయి దాలు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. మరికొన్ని కేసుల్లో ఎఫ్‌ఐఆర్ నమోదైనా పరిహారం చెల్లించడం లేదని తెలుస్తోందనీ. అట్రాసిటీ కేసులకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు వారి వాటాను ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేసి బాధితుల నష్టపరిహారం పెండింగ్‌లో ఉండకుండా నిధులను అందించవలసిందిగా సుకుమార్ కోరారు









