– ఎస్ఎఫ్ఐ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయటం దుర్మార్గపు చర్య.
– నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులు హరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
– మా పాలనలో నిర్బంధాలు ఉండవని ప్రగతి భవన్ కంచెలు తీసివేసి ఇప్పుడు ప్రజల మీదనే నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
– తక్షణమే అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలి.
– 400 ఎకరాల భూమిని యూనివర్శీటీ పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి
–
ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి టి. ప్రవీణ్
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర కేంద్రంలోని నిర్మల్ హృదయ్ స్కూల్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం డిస్టి బొమ్మను దగ్నం చేశారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభలో సి.ఎం.తప్పుడు ప్రచారం చేశారు. కార్పోరేట్ శక్తులకు భూములను అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్.సి.యు. భూములను అమ్మేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టింది. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎర్రం నవీన్‌ను అక్రమంగా అరెస్టు చేసి అర్ధరాత్రి వరకు ఏక్కడ ఉన్నాడో చెప్పకుండా, ఫోన్ లాక్కోని అర్ధరాత్రి హించించి రిమాండ్ చేయటం, విద్యార్థలపై నిర్బంధాన్ని ప్రయోగించటం, పోలీసు బలగాలతో యూనివర్సీటీని నిర్బంధించటం వంటి సంఘలనలకు నిరసనగా శాంతియుత కార్యక్రమాలకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిస్తే పోలీసులు అర్దరాత్రి నుండి జిల్లాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను 298 మందిని ఖమ్మం జిల్లాలో పలు మండల కేంద్రాలలో నాయకత్వాన్ని ముందస్తు అరెస్టు చేయటం దుర్మార్గపు చర్య. మా పాలనలో నిర్బంధాలు ఉండవని అధికారంలో వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కంచెలు తొలగించి ఇప్పుడు ఏకంగా ఇండ్లలోకి వెళ్ళి మరీ అరెస్టు చేయటాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటి ఖండిసస్తుంది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి చర్యలతో విద్యార్థులు చేస్తున్న ఉద్యమాలను ఆపలేరు. ఈ అక్రమ అరెస్టులను ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యార్థులు ఖండించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఖమ్మం జిల్లా కమిటీ కోరుతుందనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు సుధాకర్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు జిల్లా నాయకులు వినోద్, వినయ్, మనోజ్, లోకేష్, వెంకటేష్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు.