నేటి గదర్ న్యూస్, వైరా ప్రతినిధి, శ్రీనివాస్:
వైరా : వారిది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం. తల్లిదండ్రులు ఇద్దరిని కుమారుడు,కూతురు ని చక్కగా చదివించారు. కూతురు ఆత్మవిశ్వాసమే తోడుగా ఉన్నతోద్యోగం సాధించడమే తన లక్ష్యంగా చేసుకుని తొలి ప్రయత్నం లోనే అద్భుతమైన విజయం సాధించింది. గ్రూప్ -1 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో129వ ర్యాంకు, మల్టీ జోన్-1 స్థాయిలో 69 స్థానం సాధించింది సంగెపు లక్ష్మీ సాహితీ.
ఖమ్మం జిల్లా వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామం తల్లిదండ్రులు సంగెపు వెంకటేశ్వర్లు, సంగెపు కవిత తండ్రి ఎల్ఐసి ఏజెంట్ గా పని చేస్తున్నాడు. వైరాలో నివాసం ఉంటున్నారు. కూతుర్ని ఉన్నత చదువులు చదివించారు. పదవ తరగతి ఖమ్మం రెజోనెన్స్ 9.5 CGPA తో, ఇంటర్లో 96.7%, డిగ్రీలో 9.72 CGPA, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ చదివింది. ఎప్పటికైనా సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడం తన లక్ష్యం అన్నది.ఈ సందర్భంగా స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అంమ్మిక రామారావు, చుండూరు రవి, దరిపల్లి శీను, కోటూరి వెంకటేశ్వర్లు, దురిశెట్టి గోవిందరావు, సంగేపు పెద్ద నరసింహారావు, వెలనాటి నాగరాజ్ తదితరులు సంగేపు లక్ష్మీ సాహితిని ఘనంగా సన్మానించారు. సంగేపు లక్ష్మీ సాహితీ రానున్న రోజుల్లో అత్యున్నత స్థానాలకు ఎదిగి తమ గ్రామానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
