★పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేయాల్సిందేనని పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ 6గ్యారంటీలు,13 అంశాల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు గడిచినా ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క లపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ, గుండాల పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ గుగ్గిల లక్ష్మీనారాయణ, రమేష్, నిట్ట రాములు, గడ్డం వీరన్న, జాడి ప్రభాకర్, గుగ్గిల రాంబాబు, తాటి కృష్ణ, బొమ్మెర్ల శ్రీనివాస్, కుంజ సుధాకర్,పొంబోన సుధాకర్, గంగాధరి ప్రమోద్, మాజీ వార్డ్ మెంబర్ రాము, తదితరులు పాల్గొన్నారు.
