నేటి గదర్ న్యూస్, వైరా నియోజకవర్గ ప్రతినిధి, శ్రీనివాస్:
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కారేపల్లి కి చెందిన తెలంగాణ తొలి ఉద్యమకారుడు సాదిక్ఆలీ కి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలు అయినాయి. వివరాల్లో కెళ్తే డాక్టర్ సాదిక్ అలీ కారేపల్లి నుండి ఖమ్మం స్కూటీ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఢీకొట్టడంతోనే సాదిక్ ఆలీ కింద పడిపోయాడు. స్పృహ తప్పి రోడ్డు పక్కన పడి ఉండగా కొందరు చూసి వెంటనే ఆటోలో ఎక్కించుకొని ఖమ్మం ఆసుపత్రిలో చికిత్స చేయించారు . కారేపల్లి తన స్వగ్రామానికి తీసుకొచ్చారు ఈ విషయాన్ని తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎస్కే గౌసద్దీన్ తన ఇంటికి వెళ్లి ఆక్సిడెంట్ ఎలా జరిగింది ఇప్పుడు ఎలా ఉన్నారు అంటూ ఆయనను పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని ధైర్యంగా ఉండమని మీకు అండగా నేనున్నానని భరోసా కల్పించాడు.ఈ సందర్భంగా గౌసుద్దీన్ సాదిక్ఆలీ తొలి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం అహర్నిశలు శ్రమించాడని కొని కొనియాడారు .అతను త్వరగా కోలుకోవాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నాను అనీ అలాగే తన వంతు కర్తవ్యం గా వైద్య ఖర్చుల నిమిత్తం సాదిక్ ఆలీ కి రూ.5000 రూపాయలు నగదు అందించి ఓదార్చి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో డొంకెన రవీందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమ నాయకులు B చందు నాయక్, షేక్ మోసిన్, సద్దాం అబ్దుల్ వాహద్ షేక్ యాసిన్ ఫిరోజ్ షేక్ మై బల్లి,అమీర్ ముస్తాక్, షేక్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు









