*హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విరమించుకోవాలి*
*ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ*
ప్రచురణ ఏప్రిల్ 2 : బుధవారం జూలూరుపాడు మండల కేంద్రంలో ఏఎస్ఎఫ్ ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ పాల్గొని మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించిన 400 ఎకరాల భూమి వేళాన్ని నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రేపు జరుగు చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చా మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలాన్ని నిలిపివేయాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చలో సెక్రెటరీ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని పిలుపునిచ్చారు. వంశీ మాట్లాడుతూ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమించుకొని వేలం వేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడిదారుల దాహం తీర్చేందుకే భూముల అమ్మకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుంది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూమిని ఎరగా చూపి ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు తాకట్టుపెట్టే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా భూములనే కొల్లగొట్టేందుకు సిద్ధమైతే భవిష్యత్తులో యూనివర్సిటీలో ఉనికి ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. ప్రభుత్వాల నుండి ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితిలను గమనించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు భవిష్యత్తులో ప్రయోగశాలలకు అవసరమైన భూములు చేజారిపోతే భవిష్యత్ తరాల విద్యార్థులకు యూనివర్సిటీ ఉనికికి ప్రమాదమని న్యాయబద్ధంగా భూముల రక్షణ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కి అక్రమ అరెస్టులకు పాల్పడుతుంది. కెసిఆర్ ను తరిపించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుంది. ఇలాంటి నియంతృత్వ విధానాలను కొనసాగించి విద్యార్థులని అని కూడా చూడకుండా పోలీసులతో దుశ్చర్యాలను కొనసాగిస్తుంది. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల అక్రమ అరెస్టును అఖిల భారత విద్యార్థి సమైక్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పోలీసులు వెనకకు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. భూముల అమ్మకాన్ని విరమించుకోవాలి. లేనిపక్షంలో ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని వంశి హెచ్చరిస్తున్నామని అన్నారు కార్యక్రమంలో నవీన్, సాయి తేజ , రామ్ చరణ్ తేజ తదితరులు పాల్గొన్నారు