రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద ఉన్న రేషన్ దుకాణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం ప్రజా పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రోజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబ సభ్యులు సన్న బియ్యం తినాలనే లక్ష్యంతో ఈ ప్రజా పంపిణి కార్యక్రమాన్ని ఏప్రిల్ రెండు నుండి ప్రారంభించినట్లు తెలిపారు.రేషన్ దుకాణం డీలర్లు ప్రజలకు 24 గంటలు సేవలందిస్తూ సన్న బియ్యాన్ని ఎప్పటికప్పుడు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ప్రజలకు పంపిణి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్,పార్టీ నాయకులు కౌన్సిలర్లు మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ డీలర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
