రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) ఏప్రిల్ 2:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు గ్రామంలో బుధవారం రోజు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు బిటీ రోడ్డు పనులను అయన ప్రారంభించారు.అదేవిదంగా రామాయంపేట పట్టణంలోని పలు వార్డులలో బిటీ రోడ్లను ప్రారంభించారు.అనంతరం రామాయంపేట ఎంపిడిఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి,సిఎంఆర్ఎఫ్ చెక్కులను అయన అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వంలో పార్టీ నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. మెదక్ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఇప్పటి వరకు భవిష్యత్తులో లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు.మెదక్ జిల్లాలో శ్రీ ఏడుపాయల మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటున్నామని పేర్కొన్నారు.రామాయంపేట మండల వ్యాప్తంగా బీటీ రోడ్లు కలిపి 20 నుండి 30 కోట్ల రూపాయల నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఇవాళ ప్రత్యేకంగా రామాయంపేట మున్సిపాలిటీలో 14 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభం చేసుకుంటున్నామని,ప్రభుత్వ దవాఖాన నుండి డబుల్ బెడ్ రూమ్ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు.అలాగే రామాయంపేట మండల కేంద్రంలో 20 నుండి 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.గత 10 ఏళ్లలో కోల్పోయిన అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నామని తెలియపరచారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ రజనీకుమారి, మండల ఎంపీడీవో శాజీలోద్దీన్,టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు,పట్టణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటేష్,సరాపు యాదగిరి,దేమే యాదగిరి,సుందర్ సింగ్,చిలుక గంగాధర్,దేవుని జయరాజ్,సుంకోజు దామోదర్ చారి,యుగంధర్ రావు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
