నేటి గద్దర్ న్యూస్ ,చింతకాని ప్రతినిధి,
ఎప్పుడైనా పేదల పక్ష్యాన నిలిచే పార్టీ కాంగ్రెస్ మాత్రయే అని, రేషన్ షాపులు ద్వారా పేదలకు సన్నబియ్యం అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు మండలములోని ప్రొద్దుటూరు, చింతకాని గ్రామములలో సన్న్నబియ్యం పంపిణీ కార్యక్రమములో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని ప్రజలు సంతోషముగా ఉన్నారని చింతకాని మండల తహసీల్దార్, అన్నారు మండలంలోని చింతకాని గ్రామం మరియు ప్రొద్దుటూరు,వందనం, రేషన్ షాపుల వద్ద సన్నబియ్యం పధకాన్ని ప్రారంభించన చింతకాని మండల తహసీల్దార్ కూరపాటి అనంతరాజు, ఈ కార్యక్రమములో మండల పార్టి అద్యక్షులు అంబటి వెంకటేశ్వర రావు చింతకాని మండల సహకార సంఘం చైర్మన్ కొండపల్లి శేఖర్‌రెడ్డి కాంగ్రెస్ నాయకులు చింతకాని సహకార సంఘం డైరెక్టర్ కిలారు మనోహర్ బాబు పార్టీ అదికార ప్రతినిది కూరపాటి కిషోర్ ఆధ్వర్యంలో పలువురు చిత్రపటాలకు పాలాభి షేకం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయనా మాట్లాడుతూ నాణ్యతలోపం కారణంగా రేషన్ బియ్యాన్ని ప్రతిఒక్కరు వినియోగించుకోలేకపోతున్నారన్న విష యాన్ని గ్రహించి సన్నబియ్యం అందించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రతి నిరుపేదకు ఆనందదాయకం అని అన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరు పేదవాడి కడుపు నింపే ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చింతకాని తహసిలాదార్ కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి కూరపాటి కిషోర్ ఖమ్మం, జిల్లా కాంగ్రెస్ నాయకులు కన్నెబోయిన గోపి, మధిర నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్లు కొప్పుల గోవిందరావు, సట్టు వెంకటేశ్వర్లు, పార్టీ మండల మహిళా అద్యక్షురాలు తోటకూరి ప్రగతి,మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కంచుమర్తి రామకృష్ణ (ఆర్కే) మండల కాంగ్రెస్ నాయకులు బందెల నాగార్జున, జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామ నాయకులు,లబ్దిదారులు తదితరలు పాల్గొన్నారు.