+91 95819 05907

శ్రీరామ భక్తుల ట్రాక్టర్ పల్టీ.

*తెగిపడిన యువతి అరికాలు*
*మరో ఇద్దరికి తీవ్ర గాయాలు*
నేటి గదర్
డెస్క్:భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న రామభక్తుల ట్రాక్టర్ బోల్తా పడడంతో ఓ యువతీ అరికాలు తెగిపడిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రామభక్తులు పాదయాత్రగా భద్రాచలం వెళ్తున్నారు. గురువారం ఉదయం అలసటగా ఉండి అటుగా వెళుతున్న ట్రాక్టర్ పైకి ఎక్కారు. నందిపాడు సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న చాగల్లు కు చెందిన కూచిపూడి మంజు (20) అనే మహిళకు అరికాలు పాదం పూర్తిగా తెగిపోయింది. పాలకుర్తి గంగ భవాని, కొండపల్లి శ్రీనివాసరావు అనే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందించారు. ప్రమాదంలో అరికాలు ని కోల్పోయిన కూచిపూడి మంజు ను మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ తరలించారు. తెగిపడిన కాలు భాగాన్ని ఐస్ బాక్సులో పెట్టి తీసుకువెళ్లారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !