+91 95819 05907

కార్మిక సంక్షేమం, సంస్థ ప్రగతి నే టి బి జి కె యస్ అంతిమ ధ్యేయం : నాగేల్లి

★గోదావరి ఖని కేంద్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్. నాగెళ్ళి.

నేటి గదర్ న్యూస్,మణుగూరు రూరల్:
సింగరేణి బొగ్గు గనులను బడా బాబుల చేతుల్లోకి వెళ్లకుండా సింగరేణి సంస్థను కాపాడుకోవటానికి టి బి జి కె యస్ కేంద్ర కార్యవర్గ నాయకత్వం ఎలాంటి పోరాటానికి పిలుపు నిచ్చిన విజయవంతం చేయడానికి మణుగూరు ఏరియా టి బి జి కె యస్ నాయకత్వం ముందు వరుసలో ఉంటుందని ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు తెలిపారు.. టి బి జి కె యస్ రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన గోదావరి ఖని నందు సిరి ఫంక్షన్ హాల్ నందు గురువారం నాడు జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు… బొగ్గు గనుల వేలంలో ఏ ఐ టీ యూ సి, ఐ ఎన్ టి యూ సి అనుసరిస్తున్న మోసపూరిత విధానాలను కార్మిక క్షేత్రంలో ఎండకట్టి కార్మిక వర్గాన్ని చైతన్యవంతులను చేయాలని బొగ్గు గనులను నామినేషన్ పద్ధతిలోనే సింగరేణి సంస్థకు గనులు దక్కే విదంగా కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే విదంగా కేంద్ర కార్యవర్గం కార్యాచరణ రూపొందించాలని కోరారు…సింగరేణి ప్రగతి కోసం కష్టించి పని చేసే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు యాజమాన్యం దృష్టికి తీసుక వెళ్తూ వారి సమస్యల పరిష్కారం కోసం యూనియన్ కమిటి సభ్యులు ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా నిస్వార్ధంగా సేవలు అందిస్తూ సంస్థ ప్రగతి, కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు..ఏరియా నందు ఇప్పటికే సభ్యత్వాల నమోదు కార్యక్రమంకు శ్రీకారం చుట్టడం జరిగిందని కార్మిక వర్గం నుంచి మంచి ఆదరణ లభిస్తుందని ఏరియా నందు బలమైన శక్తిగా యూనియన్ ను ఎదుగుతుందని తెలిపారు.. కార్మిక, వారి కుటుంబ సభ్యుల అరోగ్య శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని టి బి జి కె యస్ సాధించిన కార్పొరేటర్ సూపర్ స్పెషాలిటీ సంక్షేమ వైద్య పథకం అమలులో పలు రకాల సమస్యలు తలెత్తుతూ కార్మిక కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పై స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర నాయకత్వం కృషి చేయాలని కోరారు.. రీఫరల్ ద్వారా కార్పొరేట్ హాస్పిటల్ కు వైద్య సేవల కోసం పంపించే సమయంలో రోగి తో పాటు తోడుగా వెళ్ళే వ్యక్తికి కార్పొరేట్ హాస్పిటల్ వారు ఎలాంటి షెల్టర్ ఇవ్వకపోవడం వల్ల రోగితే వెళ్ళే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్య పరిష్కారం కోసం కేంద్ర నాయకత్వం కృషి చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో నాయకులు జంగం రాజ్ కుమార్, ముకేశ్ కుమార్, మురళీ కృష్ణ,నాగేశ్వర రావు మరియు అన్ని ఏరియాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !