నేటి గదర్, న్యూస్ గుండాల:
సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తo చేసినందుకు కుట్రలను నిరసిస్తూ నిరసనలు తెలుపుతున్న వామపక్ష విద్యార్థి నాయకులను అక్రమ అరెస్టులు చేయడం సరైనది కాదని సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ముక్తి సత్యం, కోరం సీతారాములు అనంతరం వారు మాట్లాడుతూ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆవునూరు మధు, ఖమ్మం జిల్లా కార్యదర్శి మందుల రాజేందర్ ప్రసాద్, ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ,పాలేరు డివిజన్ కార్యదర్శి బుజ్జూరు వెంకట్రామిరెడ్డి ని ఖమ్మం నూడెమోక్రసీ కార్యాలయంలో అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండించండి అన్నారు. యూనివర్సిటీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వామపక్ష విద్యార్థి నాయకులపై లాఠీ చర్చ్ చేయన్నీ సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు. తక్షణమే భూముల ఆక్రమణ నిలిపివేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు ఈ సం కృష్ణ, యాసారపు వెంకన్న, మానాల ఉపేందర్, పెన్డకట్ల పెంటన్న మాదాల అశోక్, తదితరులు పాల్గొన్నారు









