*నేటి గద్దర్ న్యూస్ గుండాల*,హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల రేవంత్ సర్కార్ అక్రమంగా కొల్లగొట్టేందుకు చూస్తుందని ఇల్లందు డివిజన్ కార్యదర్శి నరేందర్ అన్నారు.అమ్మకాన్ని విరమించుకోవాలని హైద్రాబాద్ సెక్రటేరియట్ వద్ద శాంతియుతంగా ఆందోళన చేపడుతున్న విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం హెయమైన చర్య అని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాన్ని విరమించుకోవాలని, ఉస్మానియా యూనివర్సిటీ లో అప్రజాస్వామిక సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని పి డి యస్ యూ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన చలో సెక్రెటరియట్ కార్యక్రమంలో పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ, ప్రధాన కార్యదర్శి అనిల్ లతో పాటు వామపక్ష విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారని ఇది అప్రజాస్వామిక చర్య అని వారు అన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ కార్పొరేట్ సంస్థల నుండి వేల కోట్ల రూపాయల కమిషన్లు ఆశించి ప్రభుత్వ విశ్వవిద్యాలయాల భూములను వేలం వేసి నిర్ధాక్షణంగా అమ్ముకోవడాన్ని పి డి యస్ యూ విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు. భూముల రక్షణ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేపడితే విద్యార్థులపై లాఠీని జులిపించి విద్యార్థినీలు అని చూడకుండా జుట్టు బట్టి లాక్కుంటూ లాఠీలతో చితక భాదారని రేవంత్ రెడ్డి ఇదే అహంకారంతో క్రూరత్వాన్ని కొనసాగిస్తే విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదని వారు హెచ్చరించారు. ఖమ్మం లో ముందస్తు పేరుతో అరెస్టు చేసిన పి డి యస్ యూ జాతీయ నాయకులు నామాల ఆజాద్, ఇతర జిల్లాలలో అరెస్ట్ చేసిన విద్యార్థి సంఘ నాయకులను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు









