ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో స్వర్గీయ డిసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల శేషగిరిరావు విగ్రహాన్ని ఆవిష్కరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
నేటి గదర్ న్యూస్, ఖమ్మం ప్రతినిధి:
🔷 ఈ సందర్భంగా మిట్టపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన కేటీఆర్
🔹కీ. శే రాయల శేషగిరిరావు విగ్రహ ఆవిష్కరణకు నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు
🔹ధాన్యం కొనుగోలు జరగడం లేదు
🔹జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు
🔹17 నెలల్లో జిల్లాకు ఏం జరిగిందో ప్రజలు ఆలోచన చేయాలి
🔹కేసీఆర్ ప్రజల కోసం సీతారామా ప్రాజెక్ట్ తెస్తే ఆ నీళ్ళు నెత్తిన జల్లుకునారు కానీ ప్రజలకు ఏమి చేయలేదు
🔹ఉప ముఖ్యమంత్రి భట్టి అఫిడవిట్, నోట్‌లు అబద్ధపు హామీలు అన్ని ఇచ్చాడు
🔹తప్పకుండా ఇచ్చిన హామీని 100 రోజుల్లో చేస్తామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు
🔹కేసీఆర్ కిట్ అనే పథకం అద్భుతమైన పథకం
🔹కాంగ్రెస్ వచ్చాక ఆ పథకం ఎత్తేశారు
🔹రైతుబంధు గురించి ఆనాడు రెండు పంటలకు ఇస్తావా? అని అడిగిన రేవంత్ నేడు ఒక్క పంటకి కూడా ఇవ్వడం లేదు
🔹రైతు రుణమాఫీ లేదు, షాది ముబారక్ లేదు
🔹వాళ్ళు చెప్పిన ఏ హామీ అయినా నెరవేర్చరా?
🔹మార్పు బాగుందా? మార్పు కావాలని జిల్లా మొత్తం కాంగ్రెస్‌కి ఓటేశారు
🔹కాంగ్రెస్‌ను నమ్మి మంచి మంచి నాయకులను ఓడగొట్టారు
🔹10 ఏళ్ల పాలన చేసిన కేసీఆర్‌ను కాదని కాంగ్రెస్ విసిరిన ఆనందమైన వలలో చిక్కుకున్నారు
🔹6 గ్యారెంటీలు కాకుండా 420 హామీలు ఇచ్చారు
🔹నేను చాలా మంది ముఖ్యమంత్రులను చూసా
🔹ఎవరూ కూడా రేవంత్ రెడ్డి లాంటి దివాళాకోరు మాటలు మాట్లాడలేదు
🔹ఢిల్లీకి పోతే దొంగలాగా చూస్తున్నారంటున్నా రేవంత్.. దొంగను దొంగాలగే చూస్తారు కదా
🔹 ఢిల్లీలో అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు
🔹అపాయింట్మెంట్ ఇస్తే చెప్పులు ఎత్తుకుపోతాడని అంటున్నారు
🔹జూన్, జులైలో స్థానిక సంస్థల ఎన్నికలు పెడతారని తెలుస్తుంది
🔹ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల్లో ఉండాలి
🔹ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చాటాలి
🔹 ఢిల్లీ పార్టీలను నమ్మొద్దు అని కేసీఆర్ చిలక్కి చెప్పినట్టు చెప్పారు
🔹ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా మీకోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే
🔹రాబోయే రోజుల్లో మన ఇంటి పార్టీ మన తెలంగాణ పార్టీని ఆశీర్వదించాలి









