+91 95819 05907

సిఎస్ఐ చర్చి స్టాఫ్ నర్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో సీఎస్ఐ చర్చ్ కాంపౌండ్ లో నివాసం ఉంటున్న సరోజనమ్మ (87) స్టాప్ నర్స్ బ్రెయిన్ స్ట్రోక్ తో గత వారం రోజుల క్రితం అనారోగ్యానికి గురై హైదరాబాద్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు సాయంత్రం మృతి చెందారు.ఆమె స్వస్థలం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండల కేంద్రానికి చెందినవారు ఆమె తల్లిదండ్రులు మెదక్ సిఎస్ఐ చర్చిలో మొదటగా పని చేశారు.ఆ తర్వాత ఆమె సిఎస్ఐ మిషన్ అస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తూ గత 40 సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో మిషన్ ఆసుపత్రుల్లో నిరుపేద ప్రజలకు అనేక వైద్య సేవలు అందించారు.ఆమె మిషన్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా రిటైర్మెంట్ అయ్యి గత కొన్ని సంవత్సరాలుగా రామాయంపేట సీఎస్ఐ చర్చిలోనే భార్య భర్తలు నివాసం ఉంటున్నారు.అందరితో కలుపుగోలుగా ఉండి అందరి హృదయాల్లో ఆమె స్థిరంగా నిలిచిపోయారు.అదేవిధంగా కుటుంబ సభ్యులతో కలిసి నెలకు ఒక గ్రామం దత్తత తీసుకొని రామాయంపేట నందిగామ,తూప్రాన్ పరిసర ప్రాంతాలలో వారు సొంత ఖర్చులతో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసుకొని నిరుపేద ప్రజలకు వైద్య సేవలు కూడా అందించారు.ఆమె బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందడంతో మిషన్ కాంపౌండ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి.రామాయంపేట సిఎస్ఐ చర్చి పాస్టర్ జి సత్యానందం సంఘ నాయకులు పట్టణ ప్రజలు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు

శాంతి భద్రతలకు విగాధం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం –ఏసిపి. సాంబరాజు నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : చింతకాని మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్. బిఆర్ఎస్.ఇరు పార్టీల వారిని గ్రామపంచాయతీ

Read More »

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం”

మల్కారంలో మెచ్చు లలిత ప్రచారం: “ఆదర్శవంతమైన పంచాయతీ నా లక్ష్యం” ​-నా గ్రామ పంచాయతీ మండలంలో ఆదర్శంగా ఉండాలి -లలిత నేటి గద్దర్ న్యూస్, దమ్మపేట, (రిపోర్టర్: దాది చంటి) డిసెంబర్, 05: ​భద్రాద్రి

Read More »

సర్పంచ్ గా గెలిపిస్తే రమంతపూర్ గ్రామని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

** కాంగ్రెస్ అభ్యర్థి వర్గంటి అనిత గణేష్. నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కేంద్రంలో శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున

Read More »

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

సత్యసాయి సేవా సంస్థల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేద విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేత. వేద పాఠశాలకు సేవలందిస్తా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా లోని సత్యసాయి

Read More »

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం.

తాటిపూడి లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి విస్తృత ప్రచారం. నేటి గదర్ న్యూస్, వైరా: వైరా మండలం తాటిపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన శ్రీమతి జవ్వాజి అశ్విని

Read More »

తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ

*తండ్రి పై పోటీకి వచ్చిన తనయుడు.* ఎన్నికల మూడో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమంలో రచ్చ రచ్చ నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5. మెదక్ జిల్లా వెల్దుర్తి

Read More »

 Don't Miss this News !