+91 95819 05907

శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవాలకు హాజరైన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 9:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ పెద్దమ్మ పెద్ది రాజుల కల్యాణం శుక్రవారం నాడు ఘనంగా జరిగింది.గత గురువారం నుంచి శ్రీ పెద్దమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి.ఇందులో భాగంగా అమ్మవారి కల్యాణం,ఓడి బియ్యం అన్నదాన కార్యక్రమం,బోనాల ఊరేగింపు కార్యక్రమం ముదిరాజ్ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు.అదేవిధంగా శనివారం జాతర ఎడ్ల బండ్ల ఊరేగింపు ఉంటుందని ముదిరాజ్ సంఘ నాయకులు తెలిపారు.ఈ జాతర ఉత్సవాలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గ్రామానికి చేరుకుని శ్రీ పెద్దమ్మ వార్షికోత్సవాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ శ్రీ పెద్దమ్మ ఆశీస్సులతో పిల్లాపాపలతో పాడి పంటలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం!

మా ఇంటి ఓటు అమ్మబడదు -అంబేద్కర్ ఆశయాన్ని ప్రతిబింబించిన యువకుడి వినూత్న ప్రచారం! ఓటు విక్రయంపై విస్తృత చర్చ జరుగుతున్న వేళ, అశ్వారావుపేట యువకుడు వినూత్న నిరసనతో ప్రజల దృష్టిని ఆకర్షణ. నేటి గద్దర్

Read More »

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్

ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: ఏసీపీ వసుంధర యాదవ్ నేటి గదర్ న్యూస్, చింతకాని ప్రతినిధి : ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ అన్నారు. చింతకాని

Read More »

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ ప్లీనరీ సమావేశంను ప్రారంభించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. నేటి గదర్ న్యూస్,

Read More »

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం.

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనే మా లక్ష్యం. టీడబ్ల్యూజేఎఫ్ ఏ రాజకీయ పార్టీకి, పత్రిక కు అనుబంధ కాదు –గత రాష్ట్ర, జిల్లా కమిటీలన్నీ రద్దు –త్వరలో నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల ఏర్పాటు

Read More »

తెలంగాణ కేటాయించిన “కంపా” నిధుల వివరాలేంటి?

* అడవుల పునరుద్ధరణ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం తీసుకున్న చర్యలు ఏంటి..? * లోక్ సభలో ప్రశ్నించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి * రూ. 3,852 కోట్లు వెచ్చించినట్లు తెలిపిన కేంద్ర అటవీ

Read More »

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు..

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాయల నాగేశ్వరరావు.. నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️సతీష్ కుమార్ జినుగు. రంగారెడ్డి జిల్లా ప్యూచర్ సిటీ లో తెలంగాణ లో

Read More »

 Don't Miss this News !