★స్వీయ డిపోర్టేషన్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసిన యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ జే ట్రంప్
★ అక్రమ వలసదారులకు ఫ్రీ ఫ్లైట్ టికెట్,100 డాలర్ల ఆఫర్
★ అక్రమ వలసదారులకు చివరి అవకాశం అని ప్రకటించిన US ప్రెసిడెంట్
నేటి గదర్ న్యూస్, అంతర్జాతీయం: అమెరికాలో అక్రమ వలసదారులకు సంబంధించి ఫస్ట్ ఎవర్ సెల్ఫ్ డిపోర్టేషన్ కి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై శనివారం సైన్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ… అక్రమ వలసదారులు అమెరికాను వదిలి తక్షణమే వెళ్లాలని, దేశంలోనే తమ విమానాశ్రయాలలో అక్రమ వలసదారులు ఫ్రీ టికెట్ తీసుకొని తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని అన్నారు. లేనియెడల అమెరికా చట్టాలకు అనుగుణంగా కఠిన శిక్షలు తప్పమన్నారు. దీనితో అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారు ఏ బ్రాంతులకు లోనవుతున్నారు. యూఎస్ ప్రెసిడెంట్ నిర్ణయాన్ని ఆ దేశ మెజారిటీ ప్రజలు మద్దతు పలికారు. అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ కి కట్టుబడి అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు.









