నత్త నడక నడుస్తున్న బిజి కొత్తూరు ప్రధాన రహదారి పనులు… మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి…
బిజీ కొత్తూరు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి బీటీ రోడ్డు 63 లక్షలతో శాంక్షన్ అయి జిల్లా గౌరవ మంత్రివర్యులు స్థానిక గౌరవ శాసనసభ్యులు కలిసి శంకుస్థాపన చేసిన
పనులు కాంట్రాక్టర్ మరియు ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రహదారి పనులు నత్త నడకన జరుగుతున్నాయి.. రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా రోడ్డును తవ్వి గుంతలు చేసి రోడ్డు పనులు త్వరితగతంగా పూర్తి చేయకుండా అడ్రస్ లేకుండా వెళ్లిపోయిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా గ్రామంలోని ప్రజలు నిత్యం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు.అలాగే మోటర్ వెహికల్ కలవారు మరియు పాదచారులు రోడ్డుపై వెళ్లేటప్పుడు వారి బాధలు వర్ణానాతీతం.. కాంట్రాక్టర్ మరియు సంభందిత అధికారులు తక్షణమే రోడ్డు పనులు వేగవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.
