*ఐకెపి సెంటర్ వద్ద తడిసిన ధాన్యం ఆందోళన చెందుతున్న రైతుల*
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్) మే 15.
మెదక్ జిల్లా వెల్దుర్తి అకాల వర్షాలు అన్నదాతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు కెళ్తే మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంత్ రావు పేట గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక, ధాన్యం తూకం వేయడంలో ఆలస్యం కావడంతో తరచూ వర్షాలు పడి తాము ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని దీంతో వర్షంతో తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.









