+91 95819 05907

మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి -అఖిలపక్షం

నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను మరియు కార్పొరేట్ అనుకూల మతోన్మాద చర్యలు మరింత దూకుడుగా అమలు చేస్తున్నది. కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా వంద సంవత్సరాలు సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడులను తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లు కార్మిక వర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో అమలు ఐదు సంవత్సరాలయింది. ఇప్పుడు వాటి అమలు చేసి కార్మికులకు పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తున్నది. 2025-26 బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసింది. సామాజిక సంక్షేమాలకి కోతలు పెట్టింది. సామాన్యులపై బారాలు మోపి కార్పొరేట్ కొత్త సంస్థలకు పెట్టుబడుదారులకు వేల కోట్లు రైతులు ప్రకటించింది. ఉపాధి నిరుద్యోగం అధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోకపోవడం ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చి ఆర్థిక విధానాలను విచక్షణ రహితంగా అమలు చేస్తున్నది. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానము వెనక్కి నెట్టేందుకు భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులనేందుకు కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్లు 2025 మే 25 చేయాలని నిర్ణయించాయి. ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిషన్ మోర్చా ఎస్ కే యం సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ నేపథ్యంలో అఖిలపక్షంలో భాగమైన అశ్వరావుపేటలోని అన్ని పార్టీల నాయకులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొని 20వ తారీకున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను అందరూ ఏకమై పాల్గొని విజయవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలోని బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వలన ఐదు శాతంగా ఉన్న పెట్టుబడిదారుల వద్ద 70% ఆదాయం పోగుపడగా, 50 శాతం ప్రజల వద్ద కేవలం 3 శాతం మాత్రమే ఉండి రోజు గడవడమే కష్టంగా మారింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు నేడు ముప్పు వాటిల్లింది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తున్నారు. 12 గంటల పనిని చట్టబడటం చేస్తున్నారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు లేబర్ కోడ్లను అమలులోకి తెస్తున్నారు. కావున అఖిలపక్ష పార్టీలు, సంఘటిత అసంఘటిత కార్మికులు ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులు ఉద్యోగులందరూ ఏకమై ఈ సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వరావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీం అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు సయ్యద్ సలీం, గన్నిన రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు తుమ్మ రాంబాబు, కూన చిన్నారావు, సిపిఐ ఎంఎల్ నాయకులు గోకినపల్లి ప్రభాకర్, ఏఐటియుసి నాయకులు పటాన్ జలాల్, సిఐటియు నాయకులు పిట్టల అర్జున్, నరసింహారావు, సిపిఐ పట్టణ నాయకులు నూకవరపు విజయకాంత్, జోగిరాజు, జక్కం బలరాం, షేక్ సైదా, శ్రీను,కార్మిక సంఘాల నాయకులు రహమత్, మోర్తజ మరియు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !