అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
నేటి గద్దర్ న్యూస్, అన్నపురెడ్డిపల్లి, మే, 15: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, అబ్బుగూడెం గ్రామంలో గురువారం కరెంట్ షాక్ తో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన తుడుం దెబ్బ నాయకులు తంబల్ల రవి. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అబ్బుగూడెం గ్రామానికి చెందిన మామిడి రెమెల్యా (24) అనే యువతి అన్నపురెడ్డి పల్లి ధాన్యం మార్కెట్ యార్డ్లో రోజువారీగా పనికి వెళ్లి కరెంటు షాక్ తగిలి మరణించడం చాలా బాధాకరంఅని ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే యువతి మరణించడం జరిగినదనీ, నిరుపేద కుటుంబ వాళ్ళది, అందరూ ఆడపిల్లలే, తల్లి, తండ్రి లేరు, కూలి పని చేసుకొని బ్రతికే కుటుంబంలో ఇలా జరగటం చాలా బాధాకరంఅని, ధాన్యం యార్డ్ లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పందించి మృత కుటుంబానికి ప్రభుత్వం తరఫు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా మండలి జిల్లా అధ్యక్షురాలు షేక్ జాన్ బి, మాజీ ఎంపీటీసీ కుర్రం రాము గ్రామస్తులు పాల్గొన్నారు.









