నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్.
కార్యనిర్వాహక అధ్యక్షులు దీపక్ చౌదరి.
నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్నాహాక సమావేశం.
నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి,
✍️సతీష్ కుమార్ జినుగు.
రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ అన్నారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో నగర కాంగ్రెస్ నేతలతో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పై నగర 2వ పట్టణ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జై బాపు జై భీమ్ జై సంవీధాన్ కార్యక్రమం ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయా డివిజన్ అధ్యక్ష,కార్యదర్శులకు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంపై చేస్తున్న దాడిని ప్రజలకు వివరించాలన్నారు.బీజేపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజ్యాంగ బద్ధ సంస్థలను ఎలా నిర్వీర్యం చేస్తుందో ప్రజలకు వివరించాలన్నారు. కరపత్రాల రూపంలో గోడపత్రిక రూపంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుకురి వెంకటేశ్వర్లు, పైడిపల్లి రోహిణి, సత్యనారాయణ రాపర్తి శరత్,13 డివిజన్లఅధ్యక్షులు, పోటీ చేసినటువంటి అభ్యర్థులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు తోటకూరి శివయ్య,సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ బండి మాధవరం, ఏలూరు రవికుమార్,జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కుంటిముక్కల నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు









