భద్రాచలం : శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. వంశి అనే యువకుడు కరెంటు షాక్‌కు గురై మృతిచెందాడు. వాజేడు ప్రాంతానికి చెందిన వంశి, ప్రస్తుతం సామ్రాట్ రెసిడెన్సీ పక్కన రెంటుకు నివాసం ఉంటున్నాడు. అతను భద్రాచలంలోని దేవరాజ్ హాస్పిటల్‌లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు.
ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ MRPS నాయకులు ముద్ద పిచ్చయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరికెల తిరుపతిరావు సహా పలువురు కార్యకర్తలు కలసి ధర్నాకు దిగారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని, బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తూ నినాదాలు చేస్తూ నిరసన కొనసాగిస్తున్నారు.
Post Views: 61









