★ గడిచిన రెండు రోజులు మర్చిపోలేని రోజులుగా గుర్తుండి పోతాయి.
నేటి గదర్ న్యూస్,వెబ్ డెస్క్:
దుబాయ్‌లో జరిగిన వరల్డ్ పోలీస్ సమ్మిట్‌లో “ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కోటిక్స్ అవార్డు” క్యాటగిరీలో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ మొదటి బహుమతి అందుకున్నారు.
ఈ అవార్డు ప్రదానోత్సవానికి ముందు, పోలీసింగ్‌లో ఉన్న అన్ని రంగాల్లోని నిపుణులతో చర్చాకార్యక్రమాలు జరిగాయి. అందులో భాగంగా మన దేశంలో ప్రత్యేకించి తెలంగాణ/హైదరాబాద్‌లో మాదకద్రవ్యాల నియంత్రణ కోసం అనుసరిస్తున్న వ్యూహాలను వివరించి, మాదకద్రవ్యాల ముప్పును అణిచివేయాలంటే అంతర్జాతీయ సహకారం అవసరం పై వివరించినట్లు తెలిపారు.
138 దేశాలు నుండి వచ్చిన పోలీస్ అధికారులు, నిపుణులతో చర్చించటం, ఆలోచనలు పంచుకోవటం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది. పోలీస్ ఆఫీసర్ గా నా 34 సంవత్సరాల అనుభవంలో గడిచిన రెండు రోజులు తీపి గురుతులు గా మిగులుతాయి అని అన్నారు.









