రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 18:- తెలంగాణ రాష్ట్ర కబాడీ అసోసియేషన్ అధ్యక్షులు,రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నాయకులు కాసాని వీరేష్ జన్మదిన వేడుకలు రామాయంపేట మండల కేంద్రంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ఆధ్వర్యంలో కాసాని వీరేష్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పుట్టి రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు కాసాని వీరేష్ అని,కబాడీ అసోసియేషన్ అధ్యక్షులుగా రాష్ట్రంలో క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని అన్నారు.ముదిరాజ్ కుల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న నాయకుడు కాసాని వీరేష్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పచ్చంటి రాము,ఎర్రం సత్యం,సాధుల పరశురాం,ఎర్రం కృష్ణ, బెస్త దీపక్ సాయన్నోల మహిపాల్, బెస్త పర్శరాం తదితరులు పాల్గొన్నారు.









