రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మే 18:- సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో కీ.శే కామ్రేడ్ సిరాజుద్దీన్ ప్రాంగణంలో బీడీ కార్మిక సంఘం జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ కోశాధికారి ముక్రం మరియు బీడీ వర్కర్స్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీడీ కార్మికుల సమస్యలపైన చర్చించడం జరిగిందన్నారు.బీడీ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను అరికట్టాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పేరుతో బీడీ కార్మికులకు 416 రూపాయలు మరియు పెరిగిన కూలి రేట్లు వెంటనే ఈ నెలలో ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.బీడీ పరిశ్రమపైన జిఎస్టిని ఎత్తివేయాలని బీడీ పరిశ్రమను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.అదేవిధంగా 50 సంవత్సరాల తర్వాత రాజీనామా చేసినవారికి కనీస పెన్షన్ 6000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆది రంగ రెడ్డి మరియు బీడీ కార్మికులు మంగళ స్వప్న పుష్ప అనసూయ సుమలత బాలమణి భార్గవి భవాని తదితరులు పాల్గొన్నారు.









