ప్రభుత్వం సహాయం అందించాలని బాధితుడు విన్నపం.
నేటి గదర్ న్యూస్ ప్రతినిథి మంగపేట. విద్యుత్ ఘాతంతో పాడి గేద మృతి చెందిన సంఘటన మండలంలోని కత్తిగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు శానపురి లాలయ్య తెలిపిన వివరాల మేరకు తన కుటుంబానికి జీవనోపాధిగా ఉన్న పాడి గేదెను మేత కోసం శుక్రవారం ఉదయం వదలగా సాయంత్రం అయిన గేదె ఇంటికి రాలేదని శనివారం గేదె కోసం వెతుకుతుండగా కత్తిగూడెం గ్రామంలోని పంటపొలాల్లో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కి తగిలి మృతి చెందినట్టు తెలిపారు. తన కుటుంబానికి జీవనోపాధిగా ఉన్న పాడిగేదే మృతితో సుమారు 50 వేల రూపాయల నష్టం జరిగినట్లు వెల్లడించాడు. ఈ విషయంలో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత పాడి రైతు కోరారు.
Post Views: 348









