+91 95819 05907

మణుగూరు సింగరేణి పాఠశాలలో ఉపాధ్యాయ నియామక ప్రకటన విడుదల పట్ల హర్షం… నాగెల్లి

★యాజమాన్యానికి కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపిన ఏరియా టి బి జి కె యస్ వైస్ ప్రసిడెంట్ నాగెల్లి.

నిరుద్యోగ యువతి యువకుల కోసం 2025_26 విద్యాసంవత్సరానికి మాత్రమే మణుగూరు సింగరేణి పాఠశాలలో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్ట్ ఖాళీలను అడహాక్ తాత్కాలిక ప్రాతిపదికన నియామకం చేపడుతున్నట్టు ఏరియా డి జి యం పర్సనల్, పాఠశాల కరస్పాండెంట్ యస్ రమేష్ ప్రకటన విడుదల చేయడం పట్ల ఏరియా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైస్ ప్రసిడెంట్ నాగెల్లి వేంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు.. పాఠశాలలో తెలుగు పండిట్ ఉపాధ్యాయుల పోస్ట్ 01, హిందీ ఉపాధ్యాయ పోస్ట్ లు 2, ఆంగ్ల ఉపాధ్యాయ పోస్ట్ లు 2, గణిత ఉపాధ్యాయ పోస్ట్ లు 2, జీవ శాస్త్రం ఉపాధ్యాయ పోస్ట్ లు 2, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్ట్ లు 2 కాగా మహిళకు వ్యాయామ పోస్ట్ మరియు నాల్గవ తరగతి కి చెందిన అటెండర్ ఖాళీలు 03 గా ఉన్నట్టు ఆయన చేసిన ప్రకటనలో ఉన్నాయని తెలిపారు.. ఉపాధ్యాయ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకునే వారికి బి ఈ.డి తో పాటు టెట్, తప్పని సరిగా ఉత్తీర్ణత సాధించి ఉండాలి..యస్. సి, యస్ టి, బి సి, ఈ.డబ్ల్యూ.యస్ కేటగిరీలకు చెందిన వారికి వయస్సు, అకాడమిక్ ఎడ్యుకేషన్ మార్కులలో మినహాయింపు ఉంటుందని సంబంధిత సబ్జెక్ట్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని ఆయన తెలిపారు.. స్థానికంగా ఉండే వారికి గతంలో సింగరేణి పాఠశాలలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలిపారు ఎలాంటి ఫైరవీలకు తావు లేకుండా పోస్ట్ ల నియామకం చేపట్టనున్నారని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు పీవీ కాలనీ ఏరియా లోని సింగరేణి పాఠశాల నందు ప్రధాన ఉపాధ్యాయురాలికి దరఖాస్తులు చేసుకోవాలని గడువు తేదీ తర్వాత వచ్చే ఏ ఒక్క దరఖాస్తు కూడా స్వీకరించబడదని ప్రకటనలో పేర్కొన్నట్టు ఆయన తెలిపారు.. బోధన సిబ్బందికి ప్రతి నెల 22,750 రూపాయలు వేతన స్కేల్ ఉంటుందని 4 వ తరగతి అటెండర్ కేటగిరి పోస్ట్ లకు 15,600 గౌరవ వేతనం అందించనున్నారని తెలిపారు.. సింగరేణి లో ఖాళీగా ఉన్న బోధన బోధనేతర సిబ్బంది పోస్ట్ ల కోసం నోటిఫికేషన్ విడుదల చేయాలని గడచిన రెండు రోజుల క్రితం టి బి జి కె యస్ చేసిన విజ్ఞప్తి పై యాజమాన్యం స్పందించి ఖాళీలు భర్తీకి సర్క్యులర్ విడుదల చేయడం అభినందనీయమైన అంశమని అందుకు గాను సింగరేణి పాఠశాలల సొసైటి సెక్రటరీ గుండా శ్రీనివాస్ కు,మణుగూరు ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్ కు,ఏరియా డి జి యం పర్సనల్, పాఠశాల కరస్పాండెంట్ యస్ రమేష్ కు మణుగూరు ఏరియా టి బి జి కె యస్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, రాజ్ కుమార్, కటారి ప్రసాద్, వినయ్ కుమార్, బత్తుల శ్రీనివాస్, జ్యోతి, బి ఆర్ యస్ నాయకులు యండి హబీబ్ తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !