+91 95819 05907

అంతర్జాతీయ ఎయిడ్స్ క్యాండిల్ లైట్ మెమోరియల్ డే కొవ్వొత్తుల స్మారక దినం సందర్భంగా ర్యాలీ

*వరంగల్ జిల్లా*
*18 మే 2025*

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ వరంగల్ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి ప్రభుత్వ కాకతీయ మెడికల్ కాలేజ్ వరకు కొవ్వొత్తులు వెలిగించి అవగాహన ర్యాలీ అనంతరం సంఘీభావ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీ ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్.బీ. సాంబశివరావు మాట్లాడుతూ ఎయిడ్స్ తో మరణించిన వారిని స్మరించుకుంటూ, ప్రజలలో హెచ్.ఐ.వి , ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగించడం ,అలాగే ఎవరైతే హెచ్.ఐ.వి. వ్యాధితో జీవిస్తున్నారో వారికి , వారి కుటుంబ సభ్యులకు సంఘీభావంగా సపోర్టుగా ఉండేందుకు, కోసం ఈ కార్యక్రమం 1983 నుండి నిర్వహిస్తున్నామన్నారు. హెచ్ఐవి అవగాహన,నియంత్రణలో,పునరావాసం లో ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నారని అన్నారు. విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరు హెచ్.ఐ.వి, ఎయిడ్స్ ,పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కలిగిస్తూ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని, హెచ్ఐవి నిర్ధారణ అయినవారు ఎఆర్టి మందులు క్రమం తప్పకుండా వాడాలని వారికి ఫాలోఅప్ సేవలు అందించాలని సూచించారు.డాక్టర్.ఆచార్య మాట్లాడుతూ సి కె ఎం ప్రసూతి ఆస్పత్రి ,టీబీ ఆసుపత్రి మరియు నర్సంపేట , వర్ధన్నపేట లో ఐసిటిసి సెంటర్లు పనిచేస్తున్నాయని, ప్రతి పీహెచ్సీ లో హెచ్ఐవి టెస్టింగ్ సదుపాయం అందుబాటులో ఉందని ,అలాగే మొబైల్ వాహనం ద్వారా టెస్టింగ్ , కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని , టీబీ ఆసుపత్రిలో ఉన్న సంపూర్ణ సురక్ష కేంద్రం ద్వారా అవగాహన కార్యక్రమములు ,టెస్టింగ్, వైద్య శిబిరములు నిర్వహించడం జరుగుతున్నది అన్నారు అలాగే స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవి నియంత్రణలో భాగస్వాములుగా పనిచేస్తున్నారన్నయని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. ఐ .ప్రకాష్,ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ విజయ్ కుమార్ , ఫిజియోథెరపిస్ట్ నర్సింహ రెడ్డి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న ,మాధురి ఐ.సీ.టీ.సి సూపర్వైజర్, పట్టణ కుటుంబ సంక్షేమ ఆరోగ్య సిబ్బంది , ఐ సి టి సి కౌన్సిలర్లు, టెక్నీషియన్లు , లింక్ వర్కర్స్ ,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ,సూపర్వైజర్లు , ఏ.ఎన్.ఎం. లు, ఆశా కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు…

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

🔥🔥మావోయిస్టుల రూ.46 లక్షల నగదును స్వాధీనం

గరియాబంద్‌లో పెద్ద చర్య. నక్సల్ నెట్‌వర్క్‌కు పెద్ద షాక్. 46 లక్షల నగదు, ల్యాప్‌టాప్‌లు మరియు ఇతర సామగ్రి స్వాధీనం. గరియాబంద్ జిల్లాలోని బిగ్ గోబ్రా ప్రాంతంలో భద్రతా దళాల సంయుక్త ఆపరేషన్ విజయవంతమైంది.

Read More »

 Don't Miss this News !