*జిల్లా అధ్యక్షులు ధార రమేష్*
*నేటి గద్దర్ న్యూస్ గుండాల*, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు ధార రమేష్ గుండాల, ఆల్లపల్లి మండలాల్లో ఆదివారం పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సరికొత్త ఉత్సాహంతో ఆర్యవైశ్య సంఘం జిల్లా మహాసభను నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఎన్నికల టైములో ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చే విధంగా కృషి చేస్తున్నానని అన్నారు. ప్రతి మండలానికి 10 ఉచిత సభ్యత్వాలను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఆర్యవైశ్య సంఘ మహాసభ కార్యాలయం తో పాటు అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘ ద్వారా నిరుపేదలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుగురి నరేష్, కోశాధికారి చీమకుర్తి తాతా శ్రీనివాసరావు, జిల్లా పొలిటికల్ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, గుండాల మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మానాల వెంకటేశ్వర్లు, మానాల ప్రభాకర్, మానాల ఉపేందర్, మానాల వీరన్న, తవిడిశెట్టి నాగరాజు, తడిశెట్టి రాము, గౌరిశెట్టి ప్రభాకర్, తాటిపల్లి సత్యనారాయణ, బసవయ్య, శ్రీశైలం, నీరజ్, పూజిత్, నితీష్ తదితరులు పాల్గొన్నారు









