నేటి గదర్ కరకగూడెం: కరకగూడెం మండలం బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులుగా సిద్ధి సునీల్ కుమార్ ని ఏకగ్రీవ ఎంపిక చేసిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రకటించారు.ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ ఈరోజు నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి లాభం జరిగే విధంగా మీ ప్రయత్నం కొనసాగించాలని అలాగే అధికార పక్షం ఒంటెద్దు పోకడలను అబద్దాలతో ప్రజలను మోసం చేసిన తీరును ఎండగడుతూ ఎప్పటికప్పుడు కార్యకర్తలు అప్రమత్తం చేస్తూ ప్రజలను చైతన్యం పరచాలని ఆయన తెలిపారు.అలాగె బిఅర్ఎస్ పార్టీ సాగించే ప్రజా పోరాటంలో అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ప్రశ్నలను ప్రజలను చైతన్య పరుస్తూ మేలుకొల్పే విధంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు సిద్ది సునిల్ కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోషల్ మీడియా అధ్యక్షులుగా ఎంపిక చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు ప్రజలకు కార్యకర్తలకు చేరవేస్తూ అధికార పార్టీ చేస్తున్న మాసపూర్తమైన ఆమేలను ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేస్తానని ఆయన అన్నారు.









