ఫాసిజం అంతమొందించడమే సుందరయ్యకు నిజమైన నివాళి
సుందరయ్య జీవితం ఆదర్శం
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య
మణుగూరు: నేటి దేశంలో వేలునుకు పోతున్న ఫాసిజం ని అంత మన్నించడమే పుచ్చలపల్లి సుందరయ్య కు నిజమైన నివాళి అని అమరజీవి పుచ్చలపల్లి సుందరయ్య జీవితం దేశంలో అన్ని వర్గాల వారికి ఆదర్శమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు సోమవారం స్థానిక శ్రామిక భవనం లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా అరుణ పతాకాన్ని ఎగురవేశారు అనంతరం సుందరయ్య చిత్రపటానికి సీనియర్ నాయకులు నెల్లూరి నాగేశ్వరరావు. పూలమాల వేసి జోహార్లు అర్పించారు మడి నరసింహారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ సుందరయ్య జీవిత చరిత్ర నేటి యువతరానికి సబ్బండ వర్గాలకు ఆదర్శ అన్నారు సుందరయ్య జీవితం ఒక కమ్యూనిస్టులకే కాకుండా అన్ని రంగాల ప్రజలకు ఆదర్శమని అన్నారు సమాజంలోని కుల వ్యవస్థ అంటరానితనం చూసి చలించిపోయారన్నారు అసమానతలు లేని అంతరాలు లేని సమాజం కోసం ఆయన విశేష కృషి చేశారని ఆయన జీవితం అనేక త్యాగాలతో నిర్మితమైందని అన్నారు నేడు నిజం అరుదైన విషయంగా మారిపోయింది అబద్ధం అభివృద్ధి ముసుగేసుకుని ఆధునికతగాచలామనవుతుందన్నారు నేడు ప్రపంచీకరణ పేరుతో జరిగే ఆర్థిక వలసవాదం దేశాన్ని కబళిస్తున్న వేళ సుందరయ్య లాంటి నేతలు అవసరం అన్నారు బహుళ జాతి కంపెనీలు రైతుల భూములను ఆక్రమించినప్పుడు విదేశీ పెట్టుబడును కార్మిక శక్తిని చరబడుతున్నప్పుడు ఆర్థిక శాసనాల పేరిట మానవ హక్కులు తుడచి పెడుతున్నప్పుడు సుందరయ్య జీవితం ఎనలేని బలం ఇస్తుందన్నారు ఎదురు తిరిగే తెగవనిస్తుందన్నారు ప్రపంచీకరణలో నలిగిపోతున్న స్థానిక జీవన విధానాలకు మతోన్మాదంలో మగ్గిపోతున్న సామాజిక చైతన్యానికి సుందరయ్య దారి చూపాడని అన్నారు ఓ ప్రత్యామ్నాయ విప్లవ శాస్త్రంగా స్ఫూర్తినిస్తాడన్నారు సత్యం కోసం జీవితాన్ని ధారపోసిన విశ్వ మానవ పతాకం అవుతాడని అన్నారు ఈ కార్యక్రమాలు సిపిఎం మండల కార్యదర్శి సత్ర పల్లి సాంబశివరావు.కొడిశాల రాములు మండల కార్యదర్శి వర్గ సభ్యులు దామల్ల వెంకన్న పిట్టల నాగమణి కొండ్రుగౌరీ కుంజా రాజు ఖతిజ బేగం సున్నం మల్లేష్ కోటయ్య ఎస్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు









