+91 95819 05907

మూల ఆదివాసీలకు ST సర్టిఫికెట్లు ఇవ్వాలి

ST సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదివాసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేస్తే సహించం

బహుజన్ సమాజ్ పార్టీ(BSP) చర్ల మండల కమిటి
………………………………….
చర్ల మండలంలో మూల ఆదివాసులకు ST క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వాలని స్థానిక రెవిన్యూ కార్యాలయం ముందు ఆదివాసులు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు కొండా చరణ్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మమేకమై జీవిస్తున్న ఈ ఆదివాసీలను వలస అనేటువంటి పేరుతోటి ప్రభుత్వాలు ఎస్టీ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం ఎంతో అన్యాయమని అన్నారు రాజకీయ కుట్రలో భాగంగానే ఈ ఆదివాసులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఆదివాసుల దగ్గర ఉన్న భూమిని లాక్కునే దానికోసం ఈ ప్రాంతం నుంచి వీరిని వెల్లగొట్టే దానికోసం కుట్రలు జరుగుతున్నాయని ఈ కుట్రలను ఎంత మాత్రం సహించబోమని అన్నారు క్యాస్ట్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు చదువులు నాశనం అవుతున్నాయని వారి భవిష్యత్తు పాడవుతుందని వాపోయారు ఒకపక్క కోర్టులు ఈ ఆదివాసులకు అనుకూలంగా తీర్పులు ఇస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్న అధికారులు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు అంతేకాకుండా కొన్ని గ్రామాలకి సర్టిఫికెట్లు ఇవ్వడం మరి కొన్ని గ్రామాలకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉండటం వల్ల రెవెన్యూ అధికారులపై పలు రకాల అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారని రెవిన్యూ వాళ్లు ఈ పద్ధతిని మానుకోవాలని ఇస్తే అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వాలని లేదా ఉన్నతాధికారుల గైడ్లైన్స్ ని స్థానిక అధికారులు పాటించాలని తెలిపారు ఎన్నికల అప్పుడు ఈ ఆదివాసులకు హామీలు ఇవ్వడం ఎన్నికల అనంతరం వెళ్లను పట్టించుకోకుండా పోవడం అనేటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో నెలకొన్నదని భవిష్యత్తులో ఈ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఈ ఆదివాసి బిడ్డల ఆవేదనను అర్థం చేసుకొని తక్షణమే వలస ఆదివాసులకు కుల ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని తద్వారా ఈ ఆదివాసులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల ఈ ఆదివాసీల అందరిని ఐక్యం చేసి ఉద్యమిస్తామని హెచ్చరించారు అనంతరం ఆదివాసీలతో కలిసి స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేయడం జరిగింది తాసిల్దార్ మాట్లాడుతూ ఈ సమస్యకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుందని కోర్టు నుంచి గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తారని ప్రస్తుతానికి ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామని తద్వారా ఈ సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని ఇదివరకే ఇచ్చిన సర్టిఫికెట్లు పై విచారణ జరిపిస్తామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సామల ప్రవీణ్ చర్ల మండల అధ్యక్షులు కొండా కౌశిక్ ఆదివాసి గ్రామ పెద్దలు చందు జోగయ్య రామయ్య గ్రామస్తులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

హత్య కేసులో నిందితులు అరెస్టు.

*హత్య చేసిన నిందితుల వివరాలను వెల్లడించిన ఎడుళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు* నేటి గదర్‌ కరకగూడెం: కరకగూడెం మండలంలోని అశ్వాపురంపాడు గ్రామంలో ఫిబ్రవరి 28వ తారీఖున అర్ధరాత్రి కోవాసి వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య

Read More »

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్

జమ్మిగూడెంలో ఉపాధి హామీ కూలీల ‘ఆన్‌లైన్’ ఆవేదన.. మొరాయిస్తున్న ఎన్ఎంఎంఎస్ యాప్ ​ సర్వర్ సమస్యలతో నమోదు కాని హాజరు.. గంటల తరబడి కార్యాలయాల వద్దే పడిగాపులు.. పాత పద్ధతినే అమలు చేయాలని కూలీల

Read More »

కాంగ్రెస్ మాదిగలకు రాజ్యసభ స్థానాన్ని కేటాయించాలి

*మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరసన * నేటి గద్దర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) ఫిబ్రవరి 4. ప్రస్తుతం ఖాళీ అయిన లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ మాదిగలకు ఒక టికెట్

Read More »

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం

వేదాంతపురం విద్యుత్ కష్టాలకు చెక్: రంగంలోకి దిగిన గ్రామ నాయకత్వం ​ఎన్పీడీసీఎల్ ఏడీని కలిసిన ప్రజాప్రతినిధులు.. సమస్యల పరిష్కారానికి అధికారుల స్పష్టమైన హామీ నేటి గదర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్,

Read More »

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు

యంగ్ ఇండియా స్కూల్స్‌లో జరిగిన అవినీతి అంత ఇంత కాదు అన్ని ఆధారాలు ఉన్నాయి, త్వరలో అన్ని బయట పెడుతాను ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారు.. అన్ని ఆధారాలు ఉన్నాయి పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు

Read More »

అశ్వారావుపేటలో రాజకీయ ప్రముఖుల సందడి: చిన్నారి సాత్విక్‌కు సోయం వీరభద్రం ఆశీస్సులు

మురిసిన తిరుమలకుంట: వేడుకగా సాత్విక్ పుట్టినరోజు అశ్వారావుపేట నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, (రిపోర్టర్: దాది చంటి) మార్చ్, 04: నియోజకవర్గంలో సామాజిక అనుబంధాలను కొనసాగిస్తూ, పలు శుభకార్యాల్లో పాల్గొని నియోజకవర్గ నాయకులు సోయం

Read More »

 Don't Miss this News !