నేతాజీ వాకర్స్ క్లబ్ నూతన కమిటీని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ అధ్యక్షులుగా సామ శ్రీనివాసరెడ్డి,ప్రధాన కార్యదర్శిగా రావులపల్లి రామ్మూర్తి, కోశాధికారిగా వడ్డానం రమేష్ ఎన్నుకున్నారు. ముఖ్య సలహాదారులుగా ఎన్ విజయభాస్కర్ రెడ్డి, పుచ్చకాయల శంకర్, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, కటకం సతీష్ నియమించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ కమిటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కమిటీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ క్రీడా ప్రాంగణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. సుభాష్ చంద్రబోస్ క్రీడ మైదానం అభివృద్ధి ముఖ్య ధ్యేయంగా ఈ కమిటీని ఎన్నుకున్నామని అన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోని మణుగూరు ఏరియా స్టోర్ గ్రౌండ్ కి సుభాష్ చంద్రబోస్ క్రీడా మైదానం అని నామకరణం చేసి గ్రౌండ్ అభివృద్ధి చేసి రాబోయే తరాలకు అన్ని వసతులతో కూడిన క్రీడా ప్రాంగణంగా అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. మణుగూరు పినపాక అశ్వాపురం మండలాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, రామ్ రెడ్డి, శంకర్, శేషగిరిరావు, తిరుపతిరావు, శంకర్ రెడ్డి, సంతోష్, రవీందర్ నాయక్, కనుకు రమేష్, కంపాటి రాజేంద్రప్రసాద్, కరిమెళ్ళ శ్రీనివాసరావు, రమేష్, రవి, వినీల్, భద్ర నాయక్, బిఎస్ఎన్ఎల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.









