నేటి గద్దర్ న్యూస్, అశ్వారావుపేట, మే, 19: అశ్వారావుపేట మండలం, వేదాంతం పురం గ్రామంలో ఆదివాసి నాయక పోడు తెగవారు నిర్వహించే శ్రీ శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి వారి జాతర ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వేదాంతపురం గ్రామ మాజీ సర్పంచ్, ఆదివాసి నాయకపోడు జిల్లా అధ్యక్షులు సోమిని శివప్రసాద్ ఆహ్వానం మేరకు సోమవారం నాయకపోడు సేవా సంఘం మండల అధ్యక్షులు నారం సీతారాం సింగ్, ప్రధాన కార్యదర్శి దాది చంటి లు పాల్గొని శ్రీ శ్రీ చిన్న కొర్రాజుల స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వామివారి పూజారులు, గ్రామ పెద్దలు యువకులు పలువురు పాల్గొన్నారు.
Post Views: 127









