+91 95819 05907

ట్విట్టర్, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా సత్వరమే పరిష్కరించాలి :జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి.

ట్విట్టర్, సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా సత్వరమే పరిష్కరించాలి.

ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్.

నేటి గదర్ న్యూస్,
ఖమ్మం జిల్లా ప్రతినిధి.

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జిల్లా అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస్ రెడ్డి లతో కలిసి అర్జీలను స్వీకరించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి కృషి చేయాలని, నిబంధనల ప్రకారం మనం ఏదైనా దరఖాస్తు పరిష్కారం చేయలేని సమయంలో కారణాలు తెలియజేస్తూ స్పష్టమైన సమాధానం ఇవ్వాలని అన్నారు. ప్రజావాణి దరఖాస్తులను జిల్లా అధికారులు పక్కాగా ట్రాక్ చేయాలని, మండలాల పరిధి నుంచి వచ్చే సమాధానాలు ఎలా ఉంటున్నాయో క్రాస్ చెక్ చేసుకోవాలని అన్నారు. ప్రతి సోమవారం నాడు ప్రజావాణి తర్వాత వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
వేంసూర్ మండలం బీరపల్లి గ్రామ ప్రజలు తమ గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుందని, వాటిని వెంటనే నిలిపివేసి ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, వేంసూరు మండలం తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకొని రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు.
‌ఈ ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, జెడ్పీ సిఈఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !