నేటి గద్దర్ న్యూస్,
హైదరాబాద్.
బంజారాహిల్స్ ప్రభుత్వ పాఠశాలపై కలెక్టర్ హరి చందనా అకస్మాత్తు తనిఖీ
బంజారాహిల్స్‌లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలపై జిల్లాకలెక్టర్ హరి చందనా దాస్‌రి, IAS, ఈరోజు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల శుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతులను పరిశీలించిన ఆమె, తరగతుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారికి పాఠాలు చెప్పించి విద్యా స్థాయిని సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వ వనరులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. అనంతరం ప్రధానోపాధ్యాయురాలితో మాట్లాడి పలు సూచనలు చేశారు.
Post Views: 118









