అమ్మకు… అండగా
– అర్ధరాత్రి వేళలో సైతం డెలివరీ కేసులో పాల్గొన్న డాక్టర్ దుర్గా భవాని
పినపాక
అర్ధరాత్రి వేళలో సైతం పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే గర్భిణుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వలస ఆదివాసి గ్రామం ఎర్రగుంట నుంచి వచ్చిన గర్భిణీ తాము అనిత కు సిబ్బంది సహాయంతో డెలివరీ చేశారు. నార్మల్ డెలివరీ కాగా తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నట్లు డాక్టర్ తెలిపారు. పుట్టిన పాప బరువు మూడు కేజీలు ఉందని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాలల్లో గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు. కావున ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ దుర్గాభవాని, కాంటిజెంట్ వర్కర్ పుష్ప, ఆశా వర్కర్లు పాల్గొనట్లు డాక్టర్ దుర్గాభవాని తెలిపారు.









