*డప్పు చప్పులతో ర్యాలీ
నేటి గదర్ మెదక్ జిల్లా ప్రతినిధి (భూపాల్ మాదిగ) డిసెంబర్ 5.
మెదక్ జిల్లా మసాయిపేట లో శుక్రవారం నాడు మాసాయిపేట మండల కేంద్రంలోని హక్కింపేట గ్రామానికి చెందిన మొగిలిగుండ్ల రజిని ప్రభాకర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మొగిలిగుండ్ల రజిని ప్రభాకర్ మాట్లాడుతూ సర్పంచిగా హకీంపేట్ ప్రజల ఆశీస్సులతో హకీంపేట గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి బాటలో ముందు తీసుకు వస్తానని గ్రామ యువతకు మంచి భవిత అందిస్తారని తెలిపారు. హకీంపేట శివారులో తొందర్లో ఏర్పడే పరిశ్రమలలో స్థానికంగా అందరికీ అవకాశాలు కల్పిస్తానని సర్పంచ్ అభ్యర్థి మొగిలిగుండ్ల రజిని ప్రభాకర్ తెలిపారు.
ప్రజల కోసం సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చానని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు వచ్చానని ప్రజల నన్ను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తారని తెలిపారు.
Post Views: 77









