+91 95819 05907

దంతాలపల్లి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

దంతాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ మహబూబాబాద్ ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.
ఈ కేసులో రేపోని గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మిడతపల్లి మంగమ్మ ఫిర్యాదు చేయగా, వీరారం గ్రామానికి చెందిన గుండె అజిత్‌ను నిందితుడిగా నమోదు చేయడం జరిగింది. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు సమగ్రంగా పరిశీలించిన అనంతరం నిందితుడు నేరం చేసినట్లు రుజువుకావడంతో, సీఆర్పీసీ సెక్షన్ 235(2) ప్రకారం జీవిత ఖైదుతో పాటు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ.30,000 జరిమానా విధించడం జరిగింది.
ఈ కేసును ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీ ఎం.డి. అబ్దుల్ రఫీ విచారించగా, ప్రాసిక్యూషన్‌ను ఇన్‌చార్జ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ కొంపల్లి వెంకటయ్య నడిపించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్. జీనత్, ఎస్‌ఐ, డీసీఆర్‌బీ విధులు నిర్వహించగా, కేసు బ్రీఫింగ్‌ను పి. రాజు, ఎస్‌ఐ, దంతాలపల్లి మరియు టి. గణేష్, సీఐ, తొర్రూరు సర్కిల్ నిర్వహించారు.
కేసు దర్యాప్తును మొదటగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వై. నందీప్, అప్పటి ఎస్‌ఐ, దంతాలపల్లి చేపట్టగా, అనంతరం విచారణను వి. చెరాలు, అప్పటి సీఐ, తొర్రూరు సర్కిల్ పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయడం జరిగింది. కోర్టు డ్యూటీని బి. మంగిలాల్, దంతాలపల్లి పోలీస్ స్టేషన్ నిర్వర్తించారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !