**
*నేటి గదర్ న్యూస్ గుండాల*, గుండాల పోలీస్ స్టేషన్ ను కొత్తగూడెం ఓ ఎస్ డి ఎన్, నరేందర్ సందర్శించారు. సందర్శించిన ఆయన స్టేషన్ పరిసరాలు, రికార్డులు, మల్కన, స్టేషన్ డైరీ, స్టేషన్లోని పెండింగ్ కేసులను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక సీఐ, ఎస్ ,తిరుపతి, ఎస్సై సైదా రాహుఫ్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని ఆయన సూచించారు. కేసులను వేగవంతం చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయాలని అన్నారు. స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి చేరువై విధులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Post Views: 90








